అమరావతి అసైన్డ్ భూముల కేసు.. ఐదుగురిని అరెస్ట్ చేసి ఇద్దరిని మాత్రమే కోర్టులో ప్రవేశపెట్టిన ఏపీ సీఐడీ

  • అమ‌రావ‌తి ప‌రిధిలో అసైన్డ్ భూముల స్కాం జ‌రిగింద‌న్న సీఐడీ
  • ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన వైనం
  • వీరిలో ఇద్దరిని ఏసీబీ కోర్టులో హాజ‌రుప‌ర‌చిన సీఐడీ
  • రిమాండ్‌కు త‌ర‌లించేందుకు తిర‌స్క‌రించిన న్యాయ‌మూర్తి
  • వారిపై న‌మోదు చేసిన సెక్ష‌న్లు చెల్ల‌వ‌ని వ్యాఖ్య  
  • సీఆర్పీసీ 41ఏ ప్ర‌కారం నోటీసులు ఇవ్వాల‌ని సీఐడీకి ఆదేశం
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో అసైన్డ్ భూముల కుంభ‌కోణానికి సంబంధించి కేసులో విజయవాడలోని రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్‌.. విశాఖపట్నానికి చెందిన చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో శివరాం, వెంకటేశ్‌ను మాత్రమే గత రాత్రి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 

అయితే, వీరికి రిమాండ్ విధించేందుకు కోర్టు నిరాక‌రించింది. వారిపై నమోదు చేసిన సెక్షన్లు కేసుకు వర్తించని స్పష్టం చేసింది పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే వాటిలో రెండు మాత్రమే వర్తిస్తాయని న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయమూర్తి స్పష్టం చేశారు. ఆ రెండు సెక్షన్ల కింద నిందితుల రిమాండ్‌ను తిరస్కరించారు.  కొల్లి శివ‌రాం, గ‌ట్టెం వెంక‌టేశ్‌ల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్ల‌ద‌న్న న్యాయ‌మూర్తి... మిగిలిన సెక్ష‌న్ల ప్ర‌కారం ఏడేళ్లలోపు జైలు శిక్ష ప‌డే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు. అంతేకాకుండా నిందితుల‌కు సీఆర్పీసీ 41ఏ ప్ర‌కారం నోటీసులు ఇవ్వాల‌ని సీఐడీ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News