యూనీఫాంలో ఉన్న పోలీసుపై మూకుమ్మడి దాడి చేసిన బీజేపీ శ్రేణులు.. వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్
- జెండా కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడికి దిగిన బీజేపీ శ్రేణులు
- పారిపోతున్నా పట్టుకుని మరీ దాడికి దిగిన వైనం
- నిందితుల చేతుల్లోని జెండాలే సాక్ష్యమంటూ కాంగ్రెస్ ట్వీట్
ఖాకీ దుస్తుల్లో ఉన్న ఓ పోలీసును ఏకాకిని చేసి ఆయనపై బీజేపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి పాల్పడిన ఓ ఘటనకు చెందిన వీడియో ఒకటి మంగళవారం సాయంత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వెంటనే ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఏ ప్రాంతంలో ఈ దాడి జరిగిందన్న వివరాలు తెలియనప్పటికీ... ఖాకీ యూనీఫాంలో, తలకు హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఓ నడి వయసు పోలీసును పట్టుకున్న బీజేపీ శ్రేణులు... ఆయనపై తమ పార్టీ జెండాలకు వినియోగించే కర్రలు, రాడ్లు, రాళ్లతో మూకుమ్మడిగా దాడికి దిగాయి.
ఈ దాడి నుంచి తప్పించుకుని పరుగులు తీసిన ఆ పోలీసును బీజేపీ శ్రేణులు వెంబడించి మరీ మరోమారు దాడికి దిగాయి. ఈ సందర్భంగా ఆ పోలీసు కిందపడిపోయినా బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. చివరకు బీజేపీ శ్రేణుల్లోని ఓ వ్యక్తి ఆయనను ఓ భవన సముదాయంలోకి తీసుకెళ్లారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ కూడా షేర్ చేసింది. వీడియోలో కనిపించే జెండాలే ఈ దాడికి సాక్ష్యమంటూ తన ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ కామెంట్ జత చేసింది.