త‌న‌పై స్పీక‌ర్‌కు అందిన ఫిర్యాదుపై స్పందించిన వైఎస్ ష‌ర్మిల‌

  • అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారంటూ ష‌ర్మిల‌పై ఎమ్మెల్యేల ఫిర్యాదు
  • ఫిర్యాదుపై స్పీకర్ స్పందించిన మ‌రుక్ష‌ణ‌మే ప్ర‌తిస్పందించిన ష‌ర్మిల‌
  • త‌ల్లినైన త‌న‌ను మ‌ర‌ద‌లంటూ నిరంజ‌న్ రెడ్డి అవ‌మానించార‌న్న మ‌హిళా నేత‌
  • ముందుగా నిరంజ‌న్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌
  • త‌న‌పై చ‌ర్య‌లు తీసుకునే ముందు స్పీక‌ర్ ఆలోచ‌న చేయాల‌ని విజ్ఞ‌ప్తి
పాద‌యాత్ర‌లో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌ త‌మ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న వైనంపై న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై మంగ‌ళ‌వారం రాత్రి స్పీకర్ పోచారం కూడా స్పందించారు. తాజాగా స్పీక‌ర్ స్పంద‌న వెలువ‌డిన కాసేప‌టికే ష‌ర్మిల కూడా ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు. 

త‌న‌పై చ‌ర్య‌లు తీసుకునే ముందు స్పీక‌ర్ పోచారం ఆలోచ‌న చేయాల‌ని ష‌ర్మిల విజ్ఞ‌ప్తి చేశారు. త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ముందు త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన మంత్రి నిరంజ‌న్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఒక త‌ల్లిగా ఉన్న త‌న‌ను మ‌ర‌ద‌లంటూ కించ‌ప‌ర‌చిన నిరంజ‌న్ రెడ్డి త‌న‌తోటి వారిని అవ‌మానించార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంస్కారహీనుడైన నిరంజ‌న్ రెడ్డిపై ముందుగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె స్పీక‌ర్‌ను కోరారు.


More Telugu News