ఎలక్ట్రిక్ బైకుల సెగ్మెంట్ ను కొత్త మోడళ్లతో ముంచెత్తేందుకు హోండా సన్నాహాలు

  • ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి
  • ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న గిరాకీ
  • 2025 నాటికి 10 కొత్త మోడళ్లను తీసుకురానున్న హోండా
రానున్నది ఎలక్ట్రిక్ వాహనాల యుగం అని నిశ్చయంగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన ఆధారిత వాహనాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా, విద్యుత్ శక్తితో నడిచే వాహనాల తయారీపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. భారత్ సహా అనేక దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగం ఆశాజనకరీతిలో వృద్ధి నమోదుచేస్తోంది. 

ఈ క్రమంలో, ఆటోమొబైల్ దిగ్గజం హోండా కూడా కొత్త ఎలక్ట్రిక్ బైకుల తయారీపై శ్రద్ధ చూపుతోంది. భవిష్యత్తులో ప్రపంచ ఎలక్ట్రిక్ బైకుల సెగ్మెంట్ పై పట్టు సాధించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. 2025 నాటికి 10 కొత్త ఎలక్ట్రిక్ బైకుల మోడళ్లను తీసుకువచ్చేందుకు హోండా కృషి చేస్తోంది. 

అంతేకాదు, వచ్చే ఐదేళ్లలో ఏడాదికి 10 లక్షల విద్యుత్ బైకులను విక్రయించాలన్న లక్ష్యాన్ని అందుకోవాలని భావిస్తోంది. 2030 నాటికి 35 లక్షల ఎలక్ట్రిక్ బైకులను విక్రయించాలని నిర్దేశించుకుంది. 

హోండా ప్రధానంగా యూరప్ తో పాటు జపాన్, చైనా తదితర ఆసియా దేశాల మార్కెట్లపై దృష్టి సారించింది. తాను తీసుకువచ్చే కొత్త మోడళ్లను ఈ దేశాల్లోనే ప్రవేశపెట్టనుంది.


More Telugu News