ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకపోయినా... ఒక్క రక్త పరీక్షతో అనేక క్యాన్సర్ల గుర్తింపు
- గ్రెయిల్ హెల్త్ కేర్ కీలక ఆవిష్కరణ
- 6,662 మందిపై పరిశోధన
- కొత్త రక్తపరీక్షకు ఎంసీఈడీగా నామకరణం
- 36 రకాల క్యాన్సర్ల గుర్తింపు
వైద్య రంగంలో మరో కీలక ఆవిష్కరణ చోటుచేసుకుంది. పలు రకాల క్యాన్సర్లను గుర్తించే రక్తపరీక్ష విజయవంతమైంది. వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, ఈ ఒక్క రక్తపరీక్షతో అనేక క్యాన్సర్లను గుర్తించవచ్చు.
క్యాన్సర్ ను మరింత సమర్థంగా గుర్తించే క్రమంలో, 'గ్రెయిల్' అనే హెల్త్ కేర్ కంపెనీ ఇందుకోసం 6,662 మందిపై పరిశోధన చేపట్టింది. క్యాన్సర్ ముప్పు అధికంగా ఉండే 50 ఏళ్లకు పైబడినవారిని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ అధ్యయనం తాలూకు ఫలితాలను ఈ ఏడాది పారిస్ లో జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ (ఈఎస్ఎంఓ) సమావేశంలో వెల్లడించారు.
కాగా, ఈ రక్తపరీక్షకు మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) గా నామకరణం చేశారు. గతంలో వినియోగంలో ఉన్న రక్తపరీక్షను మరింత నవీకరించి 'ఎంసీఈడీ'కి రూపకల్పన చేశారు. క్యాన్సర్ మూలకారణం కూడా వెల్లడయ్యేలా తాజా రక్తపరీక్షను అభివృద్ధి చేసినట్టు పరిశోధకులు తెలిపారు. ఇది క్యాన్సర్ వచ్చే సూచనలను పసిగట్టడమే కాకుండా, 36 రకాల క్యాన్సర్లను గుర్తించినట్టు 'గ్రెయిల్' వెల్లడించింది.