'అల్లూరి నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- శ్రీవిష్ణు తాజా చిత్రంగా రూపొందిన 'అల్లూరి'
- పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న శ్రీవిష్ణు
- సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్
- ఈ నెల 23వ తేదీన సినిమా రిలీజ్
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా 'అల్లూరి' రూపొందింది.
బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు నటించిన ఈ సినిమాతో కొత్త కథానాయిక పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'కలవరమే కలిగేనే కలలాంటి కథలోన .. ' అంటూ ఈ పాట సాగుతోంది.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి రాంబాబు సాహిత్యాన్ని అందించగా, శ్రీనిష ఆలపించింది. హీరోహీరోయిన్ల వైపు నుంచి తొంగిచూసే ఆవేదనలో నుంచి ఈ పాట పుట్టింది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి. .
బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు నటించిన ఈ సినిమాతో కొత్త కథానాయిక పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'కలవరమే కలిగేనే కలలాంటి కథలోన .. ' అంటూ ఈ పాట సాగుతోంది.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి రాంబాబు సాహిత్యాన్ని అందించగా, శ్రీనిష ఆలపించింది. హీరోహీరోయిన్ల వైపు నుంచి తొంగిచూసే ఆవేదనలో నుంచి ఈ పాట పుట్టింది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.