వైఎస్ ష‌ర్మిల‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు

  • ఇటీవ‌లే వ‌న‌ప‌ర్తిలో మంత్రి నిరంజ‌న్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన ష‌ర్మిల‌
  • ష‌ర్మిల‌పై న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యేల ఫిర్యాదు
  • ప్రివిలేజ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ష‌ర్మిల‌పై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం
ప్ర‌జా ప్ర‌స్థానం పేరిట తెలంగాణలో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌పై ప‌లువురు ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు ఆమెపై స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. పాద‌యాత్ర‌లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ష‌ర్మిల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని స‌ద‌రు ఫిర్యాదులో ఎమ్మెల్యేలు ఆరోపించారు.

నిరాధార ఆరోప‌ణ‌ల‌తో పాటు వ్య‌క్తిగ‌త విమర్శ‌లు చేస్తున్న ష‌ర్మిల త‌మ ప్రతిష్ఠ‌కు భంగం క‌లిగిస్తున్నార‌ని స‌ద‌రు ఫిర్యాదులో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రివిలేజ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ష‌ర్మిల‌పై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌న‌ప‌ర్తిలో మంత్రి నిరంజ‌న్ రెడ్డి గ‌తంలో త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన ష‌ర్మిల‌... ఆయ‌న‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.


More Telugu News