3 రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వెళతాం: ఏపీ మంత్రి అమర్‌నాథ్
- అమరావతి రైతుల మహాపాదయాత్రపై మంత్రి అమర్‌నాథ్ విమర్శలు
- ఐదేళ్లలో చేసిన అభివృద్ధి నినాదంతోనే ఎన్నికలకు వెళతామన్న మంత్రి
- విశాఖ అభివృద్ధి వద్దని పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర వస్తున్నారని విమర్శ
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న నినాదంతో అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని యాత్రలు చేసినా.. తమ ప్రభుత్వ విధానం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటేనని ఆయన తేల్చి చెప్పారు.
అంతేకాకుండా మూడు రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈ ఐదేళ్లలో చేసిన సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళతామని తెలిపారు. విశాఖ అభివృద్ధి వద్దని పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర వస్తున్నారంటూ ఆయన అమరావతి రైతుల మహాపాదయాత్రపై విమర్శలు గుప్పించారు.