అందుకే అఖిల్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదట!

  • ఈ నెల 9న విడుదలైన 'ఒకే ఒక జీవితం'
  • రెండోరోజు నుంచి పుంజుకున్న వసూళ్లు 
  • దర్శకుడిగా శ్రీకార్తీక్ పరిచయం 
  • అఖిల్ ఎందుకు రాలేదన్నది చెప్పిన శ్రీకార్తీక్
శర్వానంద్ హీరోగా .. అమల అక్కినేని కీలకమైన పాత్రలో నటించిన 'ఒకే ఒక జీవితం' ఈ నెల 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఓపెనింగ్స్ డల్ గా ఉన్నప్పటికీ, ఆ తరువాత నుంచి మౌత్ టాక్ తో పుంజుకుంది. ఈ సినిమా చూసిన నాగార్జున ఎమోషనల్ కావడం .. ఇకపై శర్వానంద్ కూడా మా కొడుకులాంటివాడే అని చెప్పడం విశేషం.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా అఖిల్ వస్తాడని ప్రకటించారుగానీ ఆయన రాలేదు. ఫంక్షన్ చివర్లో వస్తాడేమోనని ఎదురుచూసినవారికి నిరాశే ఎదురైంది. దాంతో కారణం ఏమై ఉంటుందబ్బా అని అంతా అనుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకార్తీక్ మాట్లాడుతూ ఆ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. 

ఈ సినిమా చూసి అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత ఆయన మామూలు మనిషి కావడానికి రెండు రోజులు పట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే ఎమోషనల్ గా తనని తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమని భావించే ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నాడు" అని శ్రీ కార్తీక్ చెప్పాడు.


More Telugu News