సజ్జల కుమారుడికి వైసీపీ సోషల్ మీడియా విభాగం బాధ్యతల అప్పగింత
- సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడే భార్గవ రెడ్డి
- వైసీపీ మీడియా వింగ్ బాధ్యతల్లో ఉన్న భార్గవ రెడ్డి
- తాజాగా పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలూ అప్పగింత
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం బాధ్యతలు సజ్జల భార్గవ రెడ్డికి అప్పగిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా జగన్ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడే సజ్జల భార్గవ రెడ్డి. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన భార్గవ రెడ్డి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలపై వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.
2024 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిపోయాయి. ప్రతి చిన్న అంశంపైనా స్పందిస్తున్న ఈ పార్టీలు వైసీపీకి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియాను కూడా మరింత యాక్టివేట్ చేయాలని భావించిన జగన్.. ఆ వింగ్‌కు బార్గవ రెడ్డిని చీఫ్‌గా నియమించారు. భార్గవ రెడ్డి ప్రస్తుతం వైసీపీ మీడియా వింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.