జైల్లో పది రోజులపాటు కేవలం నీళ్లు తాగే బ్రతికానంటున్న బాలీవుడ్ నటుడు కేఆర్‌కే
- దానివల్ల పది కిలోల బరువు తగ్గానని ట్వీట్ చేసిన కేఆర్‌కే
- బాలీవుడ్ ప్రముఖలను కించపరిచినందుకు ఆరెస్ట్ అయిన నిర్మాత, విమర్శకుడు
- ఈ మధ్యే బెయిలుపై విడుదలైన కేఆర్‌కే
తాను జైల్లో ఉండగా పది రోజుల పాటు కేవలం నీళ్లు మాత్రమే తాగి బతికానని బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్‌కే అంటున్నారు. ఆహారం ఏమీ ముట్టుకోకపోవడంతో పది కిలోల బరువు తగ్గానని ట్వీట్ చేశారు. బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని 2020 నుంచి సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు చేసినందుకు కేఆర్ కే ఆగస్టు 29 న అరెస్టు అయ్యారు. ఆపై, 2021లో మరో కేసులో కూడా ఆయనపై ఎఫ్ ఐఆర్ నమోదైంది. ఈ రెండు కేసులలో ఆయన పది రోజుల పాటు జైలుకు వెళ్లి ఈ మధ్యే బెయిలుపై విడుదలయ్యారు. 'జైలులో 10 రోజుల పాటు కేవలం నీళ్లతోనే బతికాను. అందుకే 10 కిలోల బరువు తగ్గాను' అని ఈ రోజు ఆయన ట్వీట్ చేశారు.
అయితే, కమల్ చెబుతున్న విషయం నమ్మశక్యంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 'వైద్యపరంగా కూడా ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎంత కష్టపడినా.. కేవలం నీళ్లు మాత్రమే తీసుకున్నా 10 రోజులలో 10 కిలోల బరువు తగ్గడం అసాధ్యం. అంత మొత్తంలో కండరాల ద్రవ్యరాశిని, కొవ్వును కరిగించడం సాధ్యం కాదు' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ప్రచారం కోసం కేఆర్‌కే ఇలా చెబుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేఆర్‌కే చేసిన తొలి ట్వీట్ ఇది కాదు. కొన్ని రోజుల క్రిందట 'ప్రతీకారం కోరుతున్నా' అని సింగిల్ లైన్ ట్వీట్ చేసిన కేఆర్‌కే కాసేపటికి డిలీట్ చేశారు. దీని తరువాత, తన విధిని అంగీకరించడం గురించి మాట్లాడిన కేఆర్‌కే ఎలాంటి పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు .