ఆసియా కప్ గెలిచిన శ్రీలంక ఆటగాళ్లకు స్వదేశంలో ఘనస్వాగతం... ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు

  • ఇటీవల యూఏఈ గడ్డపై ఆసియా కప్
  • విజేతగా నిలిచిన శ్రీలంక జట్టు
  • ఫైనల్లో పాకిస్థాన్ పై ఘనవిజయం
  • కొలంబోలో ఆటగాళ్లకు నీరాజనాలు పలికిన అభిమానులు
ఆసియా కప్ లో టీమిండియా, పాకిస్థాన్ వంటి మేటి జట్లను ఓడించి టైటిల్ నెగ్గిన శ్రీలంక జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. యూఏఈ నుంచి కొలంబో చేరుకున్న ఆటగాళ్లను విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపుగా తీసుకెళ్లారు. 

వేలాది మంది అభిమానులు తరలిరాగా లంక ఆటగాళ్లు ఆసియా కప్ ట్రోఫీని ప్రదర్శిస్తూ, తమ మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఊరేగింపు పొడవునా అభిమానులు నినాదాలు చేయగా, టోర్నీ ఆసాంతం తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు లంక ఆటగాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. 

ఆదివారం దుబాయ్ లో జరిగిన ఫైనల్లో శ్రీలంక జట్టు 23 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను ఓడించడం తెలిసిందే. సూపర్-4 దశలో లంకేయులు వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి తమ విజయకాంక్షను చాటారు. పాకిస్థాన్ ను సూపర్-4 దశలోనూ ఓడించిన శ్రీలంక జట్టు, అదే ఊపును టైటిల్ పోరులో కొనసాగించి ఓవరాల్ గా 6వ ఆసియా కప్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది.


More Telugu News