కలెక్షన్లలో దూసుకెళ్తున్న 'బ్రహ్మాస్త్ర'
- సోమవారం రూ. 19 కోట్ల వసూళ్లు
- తొలి నాలుగు రోజుల్లో కలిపి రూ. 137-139 వచ్చినట్టు అంచనా
- గాడిలో పడిన బాలీవుడ్ పరిశ్రమ
బాలీవుడ్ రియల్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం బాలీవుడ్ లో దూసుకెళ్తోంది. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి భాగం (శివ) తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు సాధిస్తోంది. నాన్ హాలిడే రోజున విడుదలై అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన బాలీవుడ్ చిత్రంగా రికార్డు బద్దలు కొట్టింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. దాంతో, కొన్నాళ్లుగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇక్కట్లలో ఉన్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈ చిత్రంతో తిరిగి గాడిలో పడినట్టయింది.
వారాంతం వసూళ్లను కొనసాగిస్తూ సోమవారం కూడా బ్రహ్మాస్త్రకు మంచి వసూళ్లు రావడం విశేషం. సోమవారం నాడు హిందీలో రూ. 14.25 కోట్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.17-19 కోట్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన తొలి నాలుగు రోజుల్లోనే బ్రహ్మాస్త్ర రూ. 137-139 కోట్లు వసూళ్లు చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఇదే జోరు కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే రూ. 250 కోట్ల మార్కు అందుకునే అవకాశం కనిపిస్తోంది. రెండు పార్టుల్లో వస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జొహార్ రూ. 400 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో నిర్మించాడు. ఇందులో నాగార్జున, మౌని రాయ్, అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. షారూక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు.