న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో మ‌హిళ స‌హా మ‌రో ఏడుగురి అరెస్ట్‌

  • న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో తాజా అరెస్టులు
  • సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో నిందితుల‌ను హాజ‌రు ప‌ర‌చిన అధికారులు
  • ఈ నెల 26 వ‌ర‌కు నిందితుల‌కు రిమాండ్ విధించిన కోర్టు
  • విజ‌య‌వాడ‌లోని జిల్లా జైలుకు నిందితుల త‌ర‌లింపు
సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హిందూపురం మునిసిపల్ కౌన్సిల‌ర్‌, వైసీపీ నేత మారుతీ రెడ్డిని సోమ‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌శ్నించిన సీబీఐ అధికారులు... సాయంత్రానికే ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసింది. అరెస్టైన నిందితుల్లో ఓ మ‌హిళ కూడా ఉన్నారు. ఈ కేసులో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగానికి చెందిన ప‌లువురిని సీబీఐ ఇప్ప‌టికే అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ కేసులో సోమ‌వారం అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితుల‌ను సీబీఐ అధికారులు విజ‌య‌వాడ‌లోని ఐదో చీఫ్ మెట్రోపాలిట‌న్ కోర్టు (సీబీఐ ప్ర‌త్యేక కోర్టు)లో హాజ‌రు ప‌రిచారు. వీరికి కోర్టు ఈ నెల 26 వ‌ర‌కు జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితుల‌ను సీబీఐ అధికారులు విజ‌య‌వాడ‌లోని జిల్లా జైలుకు త‌ర‌లించారు.


More Telugu News