రోజూ ఒకే నంబర్ తో లాటరీ టికెట్ కొని.. జీవితాంతం డబ్బులొచ్చే బహుమతి గెలుచుకున్నాడు!
- అమెరికాలోని మిషిగన్ లాటరీ గెలుచుకున్న 55 ఏళ్ల వ్యక్తి
- జీవితాంతం ఏటా రూ.20 లక్షల బహుమతి వచ్చే లాటరీ
- అది వద్దని ఏక మొత్తంగా రూ.మూడు కోట్లు తీసుకున్న వ్యక్తి
ఉన్నట్టుండి ఒక్కసారిగా డబ్బులు వచ్చి పడితే బాగుండునని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారిలో కొందరు లాటరీ టికెట్లు కొంటుంటారు. కానీ వేల మందిలో ఏ ఒక్కరికో లాటరీ తగులుతుంది. మిగతా వారు లాటరీ టికెట్లు కొంటూనే ఉంటారు. ఫలితాలు వచ్చినరోజున చూసుకుని ఉసూరుమంటూనే ఉంటారు. కానీ కొందరికి మాత్రం అత్యంత చిత్రంగా లాటరీ తగులుతుంటుంది. అలాంటి వాడే అమెరికాలోని మిషిగన్ కు చెందిన స్కాట్ స్నైడర్. ఆ లాటరీ తగలడం కూడా చాలా చిత్రంగా జరిగింది మరి.
రోజూ ఒకే నంబర్ సెట్లతో టికెట్ కొంటూ..
అమెరికాలోని జీలాండ్ ప్రాంతానికి చెందిన స్కాట్ స్నైడర్ వయసు 55 ఏళ్లు. ఆయనకు చాలా కాలం నుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేసే అలవాటు ఉంది. అయితే చిత్రం ఏమిటంటే ఆయన.. కొన్ని నెలలుగా రోజూ ఒకే సెట్ నంబర్లతో (07–12–31–37–44) లాటరీ టికెట్ కొనడం మొదలుపెట్టాడు. ఎప్పటికైనా ఆ నంబర్ కు లాటరీ తగలగకపోతుందా అని ఎదురుచూశాడు.

- ఈ క్రమంలో ఇటీవల జీలాండ్ లోని పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు కూడా మిషిగన్ లాటరీకి చెందిన టికెట్ కొనుగోలు చేశాడు.
- ఈసారి ఆయనను అదృష్టం వరించింది. అది అలా ఇలా కాదు. జీవితాంతం ఏటా సుమారు రూ.20 లక్షల రూపాయల (25 వేల డాలర్లు) చొప్పున చెల్లించే బహుమతి వచ్చింది.
- చాలా కాలం నుంచి డబ్బుల కోసం చూస్తున్న స్నైడర్.. లాటరీ తగిలిందని సంతోషపడాలో, ఏటా కొంతే వస్తుందని నిరాశ పడాలో తెలియక ఆందోళనలో పడ్డాడు. ఇదే విషయమై లాటరీ నిర్వాహకులను సంప్రదించాడు.
- వన్ టైమ్ కింద కూడా డబ్బులు ఇచ్చే వెసులుబాటు ఉందని లాటరీ వాళ్లు చెప్పారు. అలా తీసుకుంటే సుమారు రూ. మూడు కోట్లు (4 లక్షల డాలర్లు) వస్తాయని చెప్పారు. స్నైడర్ ఆ నాలుగు లక్షల డాలర్లు తీసేసుకున్నాడు.