ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం తర్వాత మూడేళ్ల పాటు అక్కడే ఉద్యోగానికి అవకాశం ఇవ్వడంపై విజయసాయిరెడ్డి హర్షం
- ఆస్ట్రేలియాలో 1.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారన్న విజయసాయి
- చదువు తర్వాత మూడేళ్ల పాటు వీసా గడువును పొడిగించేందుకు ఆస్ట్రేలియా నిర్ణయించిందని వెల్లడి
- ఆస్ట్రేలియా నిర్ణయం భారతీయ విద్యార్థులకు ఉంతో ప్రయోజనకరమన్న సాయిరెడ్డి
ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం ముగించుకున్న విదేశీ విద్యార్థులు ఆ దేశంలో మూడేళ్ల పాటు ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
'ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులకు చదువు తర్వాత మూడేళ్లు పని చేసుకునేలా వీసా గడువును పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ప్రస్తుతం లక్షా 40 వేల మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో చదువుతున్నారు' అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు.