కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారంటే..!

కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారంటే..!
  • నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన పెద్ద కుమార్తె ప్రసీద
  • జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదువుతున్న రెండో కూతురు ప్రకీర్తి
  • సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసిన మూడో కుమార్తె ప్రదీప్తి
ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు నిన్న తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మరోవైపు, కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారనే విషయం తెలిసిందే. అయితే వారి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు.

పెద్ద కుమార్తె ప్రసీద లండన్ లో ఎంబీఏ చదివారు. ప్రభాస్ సినిమా 'రాధేశ్యామ్'తో నిర్మాతగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. రెండో కూతురు ప్రకీర్తి హైదరాబాదులోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదువుతున్నారు. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. అయితే, వీరిలో ఎవరి పెళ్లి కూడా చూడకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. తాను ఎంతో ప్రేమించే ప్రభాస్ వివాహాన్ని కూడా చూడలేకపోయారు.


More Telugu News