3 రాజ‌ధానుల నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ము వైసీపీకి ఉందా?: చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌

  • 1,000 రోజుల‌కు చేరిన అమ‌రావ‌తి రైతుల దీక్ష‌లు
  • అమ‌రావ‌తి నుంచి అర‌స‌విల్లి యాత్ర మొద‌లుపెట్టిన రైతులు
  • యాత్ర ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌
  • అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు రాగ‌ల‌రా? అంటూ వైసీపీకి స‌వాల్‌
ఏపీకి మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌తిపాదిస్తున్న వైసీపీ స‌ర్కారుపై టీడీపీ నేత‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ సోమ‌వారం ఓ స‌వాల్ విసిరారు. మూడు రాజ‌ధానుల నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ము వైసీపీకి ఉందా? అని ఆయ‌న ప్రశ్నించారు. మూడు రాజ‌ధానులు చేసి తీర‌తామంటున్న వైసీసీ... ఇప్ప‌టికిప్పుడు అసెంబ్లీని ర‌ద్దు చేసి అదే నినాదంతో ఎన్నిక‌ల‌కు రాగ‌ల‌దా? అని ఆయ‌న అడిగారు. 

ఒకే రాష్ట్రం- ఒకే రాజ‌ధాని నినాదంతో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి భూములు ఇచ్చిన రైతులు చేప‌ట్టిన దీక్ష‌లు సోమ‌వారం నాటికి 1,000 రోజుల‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తూ రాజ‌ధాని రైతులు సోమ‌వారం అమ‌రావ‌తి నుంచి అర‌స‌విల్లి దాకా మ‌హా పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ఈ యాత్ర ప్రారంభోత్స‌వంలో పాలుపంచుకున్న సంద‌ర్భంగా చింత‌మ‌నేని ఈ వ్యాఖ్య‌లు చేశారు.


More Telugu News