దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్

  • టీ20 ప్రపంచకప్ కు ముందు సొంత గడ్డపై రెండు సిరీస్ ఆడనున్న భారత్
  • దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి ప్రపంచ కప్ లో ఆడే ఆటగాళ్లకు విశ్రాంతి
  • వీవీఎస్ లక్ష్మణ్ కు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశం
ఆసియా కప్ లో సూపర్-4 దశలోనే నిష్క్రమించిన టీమిండియా హోమ్ సిరీస్ లకు సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20లను ఆడనుంది. తొలి టీ20 సెప్టెంబర్ 20న మొహాలీలో జరుగుతుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లను ఆడనుంది. సెప్టెంబర్ 28న తిరువనంతపురంలో తొలి టీ20 జరగనుంది. 

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ బాధ్యతలను కట్టబెట్టింది. మరోవైపు ఈ సిరీస్ కు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది.


More Telugu News