మ‌ద్య‌పాన నిషేధంపై పిటిష‌న్ విచార‌ణ‌కు నో చెప్పిన సుప్రీంకోర్టు

  • దేశ‌వ్యాప్తంగా మ‌ద్య‌పాన నిషేధం అమ‌లుకు అదేశాలు ఇవ్వాలంటూ పిటిష‌న్‌
  • సుప్రీంకోర్టు సీజే జ‌స్టిస్ ల‌లిత్ ధ‌ర్మాస‌నం ముందుకు వ‌చ్చిన పిటిష‌న్‌
  • ఇది సుప్రీంకోర్టు ప‌రిధిలోకి రాద‌న్న జ‌స్టిస్ ల‌లిత్‌
దేశ‌వ్యాప్తంగా మ‌ద్య‌పాన నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు విముఖ‌త వ్యక్తం చేసింది. ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు ప‌రిధిలోకి రాదంటూ భార‌త ప్రధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ల‌లిత్ నేతృత్వంలోని ధ‌ర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేర‌కు త‌మ ముందుకు వ‌చ్చిన పిటిష‌న్‌ను నేడు జ‌స్టిస్ ల‌లిత్ బెంచ్ కొట్టేసింది. 

జాతీయ స్థాయిలో మ‌ద్య‌పాన నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవ‌లే ఓ పిటిష‌న్ దాఖ‌లైంది. దేశ‌వ్యాప్తంగా మ‌ద్య‌పాన నిషేధంపై విధానం రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని స‌ద‌రు పిటిష‌న్‌ను దాఖ‌లు చేసిన వ్య‌క్తి కోర్టును కోరారు. ఈ పిటిష‌న్ సోమ‌వారం జ‌స్టిస్ ల‌లిత్ ధ‌ర్మాస‌నం ముందుకు రాగా... ఇది సుప్రీంకోర్టు ప‌రిధిలోకి రాద‌ని పేర్కొంటూ పిటిష‌న్‌ను కొట్టివేశారు.


More Telugu News