మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఎమ్మార్పీఎస్ నేతల యత్నం

  • పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్
  • రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాసులును సస్పెండ్ చేయాలన్న ఎమ్మార్పీఎస్ నేతలు
  • అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించిన పోలీసులు
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఎమ్మార్పీఎస్ నేతలు యత్నించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 20 మార్కులు తగ్గించాలని కోరారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాసులును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. అసెంబ్లీ దగ్గర సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. అసెంబ్లీ చుట్టు పక్కల నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.


More Telugu News