కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరపున ఎవరెవరు హాజరవుతున్నారంటే..!
- అంత్యక్రియలకు హాజరవుతున్న రోజా, కారుమూరి, వేణుగోపాల్, ప్రసాదరాజు
- కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళి అర్పించిన ఏపీ మంత్రులు
- కాసేపట్లో కృష్ణంరాజు అంత్యక్రియలు
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగనున్నాయి. అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు రోజా, కారుమూరి నాగేశ్వరరావు, వేణుగోపాల్, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరవుతున్నారు. కాసేపటి క్రితం వీరు కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళి అర్పించారు.
అనంతరం కారుమూరి మాట్లాడుతూ, కృష్ణంరాజు గారి అకాల మరణం బాధాకరమని చెప్పారు. కృష్ణంరాజు మరణ వార్త విని ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతికి గురయ్యారని తెలిపారు. కృష్ణంరాజు గారు రాజకీయాలకు అతీతంగా అందరితో ఆత్మీయంగా ఉండే వారని చెప్పారు. ప్రసాద్ రాజు మాట్లాడుతూ... సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ప్రజల మనసుల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారని చెప్పారు.