కృష్ణంరాజు పార్థివదేహంపై బీజేపీ పతాకం... వీడియో ఇదిగో!
- బీజేపీ తరఫున గతంలో ఎంపీగా గెలిచిన కృష్ణంరాజు
- కేంద్రమంత్రిగానూ పనిచేసిన రెబల్ స్టార్
- కృష్ణంరాజు నివాసానికి వచ్చిన బీజేపీ నేతలు
- భౌతికకాయంపై జెండా కప్పి అమర్ రహే అంటూ నినాదాలు
దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. కృష్ణంరాజు తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు బీజేపీ నేత కావడంతో, ఇవాళ ఆయన పార్థివదేహంపై గౌరవసూచకంగా పార్టీ జెండాను కప్పారు.
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి వచ్చారు. తమ నేత భౌతికకాయంపై బీజేపీ జెండా ఉంచి నివాళులు అర్పించారు. కృష్ణంరాజు గారు అమర్ రహే, అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విష్ణువర్ధన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.
కృష్ణంరాజు 1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఆ మరుసటి ఏడాదే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలో దిగి మరోసారి ఎంపీగా ఘనవిజయం అందుకున్నారు. రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఆయనను అప్పటి బీజేపీ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుంది.