శర్వానంద్ ప్లాన్ ఫలించినట్టే!
- ఈ నెల 9న థియేటర్లకు వచ్చిన 'ఒకే ఒక జీవితం'
- టైమ్ ట్రావెల్ తో ముడిపడిన మదర్ సెంటిమెంట్
- నిరాశపరిచిన ఓపెనింగ్స్
- శని .. ఆదివారాల్లో పుంజుకున్న వసూళ్లు
శర్వానంద్ తాజా చిత్రంగా ఈ నెల 9వ తేదీన 'ఒకే ఒక జీవితం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వా ఖాతాలో వరుసగా అరడజను ఫ్లాపులు ఉండటం వలన, ఈ సినిమాపై ఆడియన్స్ అంతగా ఆసక్తిని కనబరచలేదు. ఇక రిలీజ్ కి ముందు అంచనాలు పెంచేయడం వలన ఫలితం ఎలా ఉంటుందనేది కూడా ఆయనకి అనుభవంలోకి వచ్చింది.
అందువలన శర్వానంద్ ప్రమోషన్స్ పరంగా ఈ సినిమాకి హైప్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేయలేదు. మౌత్ టాక్ ద్వారా జనాలను థియేటర్స్ కి రప్పించే స్టఫ్ ఈ సినిమాలో ఉందని ఆయన ముందుగానే భావించాడట. అందువల్లనే ఇంటర్వ్యూలలోను .. ఈవెంట్స్ లోను పెద్దగా హడావిడి చేయలేదు. ఒక మంచి ప్రయత్నం చేశానని మాత్రమే చెప్పుకుంటూ వచ్చాడు.
ఇక రిలీజ్ రోజున చాలా థియేటర్స్ లో ఈ సినిమా నీరసంగానే నడిచింది. ఈ సినిమాలో మదర్ సెంటిమెంటును టచ్ చేస్తూ టైమ్ ట్రావెల్ కథ నడుస్తుందనీ, కథలోనే భాగమైన కామెడీ ఆకట్టుకుంటుందనే టాక్ బయటికి వచ్చింది. దాంతో శని .. ఆదివారాల్లో చాలా ప్రాంతాల్లో ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయని అంటున్నారు. ఈ సినిమాతో శర్వాకి కొత్త ఉత్సాహం వచ్చేసినట్టేనని చెబుతున్నారు.