యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 19 ఏళ్లకే విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్
- అల్కరాజ్-కాస్పెర్ రూడ్ మధ్య ఫైనల్ పోరు
- మూడున్నర గంటలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్
- అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ నంబర్ ర్యాంకును అందుకున్న అల్కరాజ్
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. నిన్న జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రెండు యువకెరటాలు తలపడ్డాయి. చివరికి స్పానిష్ ఆటగాడు కార్లస్ అల్కరాజ్ విజయం సాధించి తొలి ట్రోఫీతోనే చరిత్రను తిరగరాశాడు. నార్వేకు చెందిన కాస్పెర్ రూడ్‌తో జరిగిన పోరులో 19 ఏళ్ల స్పానిష్ యువ కెరటం కార్లస్ అల్కరాజ్ విజయం సాధించాడు. న్యూయార్క్‌లో జరిగిన ఈ పోరు ఆద్యంతం హోరాహోరీగా సాగింది. మొత్తంగా మూడున్నర గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్‌దే పైచేయి అయింది. 6-4, 2-6, 7-6(7-1), 6-3 తేడాతో విజయం సాధించి తొలి యూఎస్ ఓపెన్ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ విజయంతో 2005 తర్వాత యూఎస్ ఓపెన్‌ను దక్కించుకున్న అత్యంత పిన్నవయస్కుడైన ఆటగాడిగా కార్లస్ అల్కరాజ్ రికార్డులకెక్కాడు. 2005లో రఫేల్ నాదల్ (ఫ్రెంచ్ ఓపెన్) గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి 19 ఏళ్ల వయసులోనే ఆ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ అల్కరాజ్‌కు ఆ రికార్డు సొంతమైంది. అంతేకాదు, 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.