హైదరాబాద్​ సహా తెలంగాణవ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు

  • గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ
  • ఇప్పటికే రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన
  • ముసురుపట్టడంతో ఇబ్బంది పడుతున్న జనం
గ్రేటర్ హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగంతో వీచే అవకాశం ఉందని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం కారణంగా విస్తారంగా వానలు పడుతున్నట్టు వివరించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడుతోందని.. దీనితో రెండు రోజుల తర్వాత వానలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేసింది.

హైదరాబాద్ ను వీడని ముసురు
గ్రేటర్ హైదరాబాద్ వాసులను వాన ముసురు పట్టి వీడటం లేదు. శనివారం ఉదయం నుంచీ మొదలైన వాన.. ఆదివారం సాయంత్రం దాటినా కురుస్తూనే ఉంది. ఇంట్లోంచి బయటికి వెళ్లలేని పరిస్థితితో జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటికి వచ్చినవారు, ఉద్యోగులు రహదారులపై నీళ్ల కారణంగా అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు బురదమయంగా మారిపోయాయి.


More Telugu News