చిన్న నక్క పిల్ల.. వెంటపడి మహిళను దారుణంగా కొరికిన వైనం.. వీడియో ఇదిగో

  • తన ఇంటి వెనుక ఆవరణలో నిలబడి ఫోన్‌ మాట్లాడుతున్న మహిళ
  • ఒక్కసారిగా దూసుకువచ్చిన నక్కపిల్ల
  • తోసేసినా, తన్నినా వదలకుండా కొరికిన వైనం
  • సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు
ఓ మహిళ తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలో నిలబడి ఫోన్‌ మాట్లాడుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నక్క పిల్ల వేగంగా ఆమె వద్దకు దూసుకువచ్చింది. వచ్చీరాగానే మీద పడి కరవడం మొదలుపెట్టింది. ఆ నక్క పిల్లను తన్నేయడానికి, చేత్తో కొట్టడానికి ఆ మహిళ ప్రయత్నించింది. గట్టిగా అరిచింది. అయినా ఆ నక్క పిల్ల వదలలేదు. కాళ్లు దొరికితే కాళ్లు, చేత్తో కొట్టబోతే చేతిని గట్టిగా కొరికి పట్టేసుకోవడం మొదలుపెట్టింది. ఎంత ప్రయత్నించినా, నాలుగైదు సార్లు గట్టిగా తన్నినా, దూరంగా పరుగెత్తేందుకు ప్రయత్నించినా కూడా ఆ నక్క పిల్ల వెనక్కి తగ్గకుండా వెంటపడింది.

పక్క ఇంట్లోని వ్యక్తి వచ్చాక..
కాసేపటికి పక్క ఇంట్లో ఉండే ఓ వ్యక్తి ఇది గమనించాడు. చేతిలో ఓ రాడ్‌ పట్టుకుని పరుగెత్తుకు వచ్చాడు. అప్పుడుగానీ ఆ నక్క మహిళను వదిలేసి పారిపోలేదు. సదరు మహిళకు కాళ్లకు, చేతికి తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స చేయించారు.
దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలను ఆ మహిళ సోదరుడు ఆన్‌ లైన్‌ లో పెట్టారు. నక్క దాడి చేస్తోందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
  • అయినా ఆ నక్క మరోసారి ఆ ప్రాంతానికి వచ్చి ఇంకో వ్యక్తిపై దాడి చేసింది. ఈసారి కొందరు కలిసి దాన్ని చంపారు.
  • మృతదేహాన్ని సమీపంలోని కార్నెల్‌ యూనివర్సిటీ ల్యాబ్‌ కు తీసుకెళ్లి పరీక్షించగా.. దానికి రేబిస్‌ వ్యాధి ఉన్నట్టు బయటపడింది. దీంతో ఆ నక్క కరిచిన వారందరికీ రేబిస్‌ వ్యాక్సిన్‌, మందులు ఇచ్చి చికిత్సలు చేయించారు.
  • ఆరోగ్యంగా ఉండే నక్కలు అంత దారుణంగా దాడి చేయవని.. రేబిస్‌ సోకిన నక్కలు అయినా, కుక్కలు అయినా నియంత్రణ కోల్పోయి ఇష్టమొచ్చినట్టు దాడి చేస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.


More Telugu News