నన్ను, రాజశేఖర్ ను కృష్ణంరాజు గారు తమ సొంత మనుషుల్లా చూసుకునేవారు: జీవిత
- అనారోగ్యంతో కన్నుమూసిన కృష్ణంరాజు
- విషాదానికి గురైన జీవిత
- ఆయనతో చాలాకాలం నుంచి పరిచయం ఉందని వెల్లడి
- మా కోసం ఎంతో సిన్సియర్ గా పనిచేశారని వివరణ
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం పట్ల నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ స్పందించారు. కృష్ణంరాజు గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవని, అంత మంచి మనిషి అని వెల్లడించారు. ఆయనతో తమకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని, 'మా' సంక్షోభం సమయంలో ఆయన తనను, రాజశేఖర్ ను ఇంటిమనుషుల్లా భావించేవారని తెలిపారు.
ఆయనకు 'మా' అంటే ప్రాణం అని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏమైపోతుందోనని ఆందోళన చెందేవారని, ఎంతో సిన్సియర్ గా పనిచేసేవారని జీవిత వివరించారు. 'మా' పరువు మర్యాద కాపాడేందుకు ఎంతో తపించిపోయారని, 'మా' పట్ల ఆయనకు తీవ్రమైన భావోద్వేగాలు ఉండేవని వివరించారు. బయటి వాళ్ల మధ్య పలుచన కాకూడదని 'మా' వాళ్లందరికీ చెబుతుండేవారని తెలిపారు.
ఇక, రాజశేఖర్ గురించి ప్రతిసారీ ఏదో ఒక సందర్భంలో "రాజశేఖర్ చాలా మంచివాడయ్యా, రాజశేఖర్ కు మనసులో ఎలాంటి కల్మషం ఉండదు" అని చెబుతుండేవారని జీవిత గుర్తుచేసుకున్నారు. తనకు, రాజశేఖర్ కు, తమ పిల్లలకు, కృష్ణంరాజు గారితో, వారి అర్ధాంగితో, వారి పిల్లలతో ఎంతో సాన్నిహిత్యం ఉందని చెప్పారు. ఏదైనా విషయంలో చర్చించాలంటే తాము కృష్ణంరాజు గారి కుటుంబంపైనే ఆధారపడే వాళ్లమని తెలిపారు.
ఇవాళ ఉదయం కృష్ణంరాజు గారు ఇక లేరన్న వార్త తెలిశాక, సొంత ఇంటి మనిషి పోయినంత బాధ కలిగిందని, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. కృష్ణంరాజు గారిని తాము ఎప్పటికీ ప్రేమిస్తుంటామని వెల్లడించారు.
ఆయన తన పేరుకు తగ్గట్టుగానే రెబల్ స్టార్ అని, మనసులో ఏదీ ఉంచుకోరని, ఎవరినైనా నిలదీస్తారని వివరించారు. రాజశేఖర్ కూడా తనలాంటివాడేనని ఎప్పుడూ చెబుతుండేవారని అన్నారు.
ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయని, ఎప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లినా "అది తింటారా, ఇది తింటారా" అని ఆప్యాయత కనబర్చేవారని తెలిపారు. మామిడికాయల సీజన్ లో అయితే ఆయన తప్పకుండా మామిడికాయలు పంపేవారని గుర్తు చేసుకున్నారు.
ప్రతి ఒక్కరికీ ఆయన మరణం పెద్ద నష్టమని, ముఖ్యంగా తమ కుటుంబానికి శూన్యం ఆవహించినట్టుగా ఉందని జీవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కృష్ణంరాజు కుటుంబానికి ధైర్యం కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు.