ఆప్ సర్కారు నిర్ణయంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం

  • సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్
  • మండిపడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ
  • ఢిల్లీ సర్కారును అపఖ్యాతి పాలు చేస్తున్నారని ఆరోపణ
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సర్కారు 1,000 లోఫ్లోర్ బస్సుల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రాగా, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న ప్రతిపాదనకు సక్సేనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో బస్సుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి జరిగితే, అది వెలుగులోకి రానుంది.

ఇప్పటికే ఢిల్లీ సర్కారు లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదే అంశంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు పలు విడతలుగా సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేశారు. ఇదే అంశంలో ఈడీ సైతం దర్యాప్తు మొదులు పెట్టింది. వీటికి అదనంగా ఇప్పుడు మరో కేసులో సీబీఐ దర్యాప్తు సర్కారుకు చిక్కులు తెచ్చి పెట్టనుంది. దీనిపై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ ఏడాదిన్నర క్రితమే ఏమీ తేల్చలేదని, ఇప్పుడు లెఫ్టి నెంట్ గవర్నర్ ఎందుకు తమ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.


More Telugu News