కృష్ణంరాజు గారి మృతి బాధాకరం: ఏపీ సీఎం జగన్
- నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్న సీఎం
- ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సంతాపం
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జగన్
ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మధుమేహం, మూత్ర పిండాల వైఫల్యం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో నెల రోజులకు పైగా ఏఐజీ హస్పిటల్ లో చికిత్స పొందుతూ కృష్ణంరాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూయడం తెలిసిందే. దీంతో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
‘‘కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అంటూ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.