మా ఊరి 'హీరో' కృష్ణంరాజు.. తమ్ముడు ప్రభాస్ కు సంతాపం తెలియజేస్తున్నా: చిరంజీవి
- కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం
- తొలి రోజుల నుంచి పెద్దన్నలా ప్రోత్సహించారు
- రెబల్ స్టార్ కి ఆయన నిజమైన నిర్వచనం
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. మరోవైపు కృష్ణంరాజు మృతి పట్ల చిరంజీవి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరమని ఆయన అన్నారు. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో తన తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి 'మనవూరి పాండవులు' దగ్గర నుంచి నేటి వరకు తన అనుబంధం ఎంతో ఆత్మీయమైనదని చెప్పారు.
'రెబల్ స్టార్'కి ఆయన నిజమైన నిర్వచనం అని చిరంజీవి అన్నారు. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలందించారని కొనియాడారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా తనకు, సినీ పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిదని చెప్పారు. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, తన తమ్ముడి లాంటి ప్రభాస్ కు సంతాపాన్ని తెలియజేసుకుంటున్నానని ట్వీట్ చేశారు.