తెలుగు సినీ పరిశ్రమలో తొలి నంది అవార్డు అందుకున్న ఘనత కృష్ణంరాజుదే!

  • ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కృష్ణంరాజు
  • 'చిలకాగోరింక' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్
  • 56 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న కృష్ణంరాజు
టాలీవుడ్ లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. పోస్ట్ కోవిడ్ బాధలతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1966లో 'చిలకాగోరింక' చిత్రంలో టాలీవుడ్ లో హీరోగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. 

ఓక వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు విలన్ క్యారెక్టర్లను కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 200కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. తన 56 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో ప్రత్యేకతలను, ఘనతలను సొంతం చేసుకున్నారు. తెలుగులో మొట్టమొదటి నంది అవార్డును అందుకున్న ఘనత కూడా ఆయనదే. మరోవైపు ఆయన మృతి వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురవుతోంది.


More Telugu News