రాజస్థాన్ కు 'కర్తవ్యస్థాన్' అని నామకరణం చేయండి: శశిథరూర్ వ్యంగ్యం

  • ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ప్రారంభం
  • రాజ్ పథ్ కు కర్తవ్యపథ్ గా నామకరణం
  • రాజ్ భవన్ ను కర్తవ్యభవన్ లు గా మార్చాలన్న థరూర్
  • రాజ్ పథ్ తోనే ఆగిపోయారేం? అంటూ ఎద్దేవా
ఢిల్లీలో ఏర్పాటు చేసిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ పథ్ కు కర్తవ్యపథ్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యంగ్యం ప్రదర్శించారు. రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా మార్చినప్పుడు, దేశంలోని అన్ని రాజ్ భవన్ లను 'కర్తవ్య భవన్' లుగా మార్చాలని సెటైర్ వేశారు. అంతేకాదు, రాజస్థాన్ ను కూడా 'కర్తవ్యస్థాన్' గా మార్చాలని సలహా ఇచ్చారు. రాజ్ పథ్ తోనే ఎందుకు ఆగిపోయారు? అన్నింటికి 'కర్తవ్య' వచ్చేలా పేరుమార్చండి అంటూ ఎద్దేవా చేశారు. 

అంతకుముందు, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ఇదే తరహాలో ఓ సందేహాన్ని వెలిబుచ్చారు. ఇక రాజ్ భవన్ లన్నీ 'కర్తవ్య భవన్' లు అవుతాయా ఏంటి? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ ఇకపై 'కర్తవ్యధాని' (రాజధాని) ఎక్స్ ప్రెస్ లో 'కర్తవ్యభోగ్' మిఠాయి తింటూ, 'కర్తవ్య కచోరీ'లను రుచి చూస్తూ ప్రయాణిస్తారనుకుంటా అని మహువా మొయిత్రా మరో ట్వీట్ చేశారు.


More Telugu News