కొడాలి నాని! 2024 లోపు మమ్మల్ని చంపెయ్.. లేదా నువ్వు చస్తావ్: బుద్ధా వెంకన్న
- ఢిల్లీ లిక్కర్ స్కాంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం
- టీడీపీ విమర్శలను ఖండిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని
- నాని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బుద్ధా వెంకన్న
- భువనేశ్వరిపై విమర్శలను సహించబోమని హెచ్చరిక
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి పాత్ర ఉందంటూ టీడీపీ చేసిన ఆరోపణలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లపై శుక్రవారం ఘాటు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
నాని వ్యాఖ్యలపై శనివారం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. 2024లోగా తమను చంపేయాలని కొడాలి నానికి సూచించిన వెంకన్న... లేదంటే నువ్వు చస్తావ్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
చంద్రబాబు, లోకేశ్‌లపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు శనివారం టీడీపీ నేతలతో కలిసి వెళ్లిన వెంకన్న.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నానిని ఆయన కుక్కతో పోల్చారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను కీర్తించే కొడాలి నాని... నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని అవమానిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనేశ్వరి టార్గెట్‌గా విమర్శలు చేస్తే ఇకపై సహించేది లేదని కూడా బుద్ధా వెంకన్న హెచ్చరించారు.