నాలుగు మాడ వీధుల్లో ప్రతి భక్తుడికి సంతృప్తి కలిగేలా వాహనసేవల దర్శనం కల్పిస్తాం: టీటీడీ
- సెప్టెంబరు 27 నుంచి బ్రహ్మోత్సవాలు
- రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ బ్రహ్మోత్సవాలు
- ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్న ఈవో ధర్మారెడ్డి
- శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
రెండేళ్ల తర్వాత తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల నడుమ శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి స్పందించారు.
'డయల్ యువర్ ఈవో' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లుగా తిరుమలలోని నాలుగు మాడ వీధుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేకపోయామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు నాలుగు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. నాలుగు మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్ తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల పర్యటన సందర్భంగా ఆయన నూతన పరకామణి మండపం ప్రారంభించనున్నారు.