శింబు 'ముత్తు' మూవీ నుంచి టీజర్ రిలీజ్!
- శింబు హీరోగా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'
- కథానాయికగా సిద్ధు ఇద్నాని
- కీలకమైన పాత్రలో రాధిక
- సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్
- ఈ నెల 15వ తేదీన విడుదల
ప్రస్తుతం శింబు కోలీవుడ్ లో కెరియర్ పరంగా పూర్వ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగే తన సినిమాలను తెలుగులో కూడా విడుదలయ్యేలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా తమిళంలో 'వెందు తుణీందదు కాడు' సినిమా రూపొందింది. గణేశ్ నిర్మించిన ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకుడు.
తెలుగులో ఈ సినిమాకి ' ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే టైటిల్ ను సెట్ చేశారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో అమాయకంగా పెరిగిన ముత్తు, బ్రతుకు తెరువు కోసం పట్నం వస్తాడు. పరిస్థితులు ఆయనను ఎలా మార్చాయనేదే కథ.
అందుకు సంబంధించిన సన్నివేశాల పై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. శింబు జోడీగా సిద్ధు ఇద్నాని నటించిన ఈ సినిమాలో, రాధిక కీలకమైన పాత్రను పోషించింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిఫరెంట్ లుక్ తో శింబు చేసిన ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.