బ్రిట‌న్ రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ చార్లెస్‌- 3

  • గురువారం మ‌ర‌ణించిన బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్‌- 2
  • ఆమె పెద్ద కుమారుడి హోదాలో రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చార్లెస్‌- 3
  • కార్య‌క్ర‌మాన్ని తొలిసారిగా టీవీల్లో ప్ర‌సారం చేసిన వైనం
బ్రిట‌న్ నూత‌న రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థ‌ర్ జార్జ్ (చార్లెస్- 3) అధికారికంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం శ‌నివారం మ‌ధ్యాహ్నం లండ‌న్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఆక్సెష‌న్ కౌన్సిల్ ఆయ‌న‌ను బ్రిట‌న్ రాజుగా ప్ర‌కటించింది.  మొన్న‌టిదాకా బ్రిట‌న్ రాణిగా కొన‌సాగిన ఎలిజ‌బెత్- 2 గురువారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆమె పెద్ద కుమారుడిగా ఉన్న చార్లెస్‌- 3ని బ్రిట‌న్ రాజుగా కౌన్సిల్ ప్ర‌క‌టించింది. 

ప్ర‌స్తుతం 73 ఏళ్ల వ‌య‌సులో ఉన్న చార్లెస్‌- 3... బ్రిట‌న్ రాజరిక వ్య‌వ‌స్థ‌ల‌తో అత్యంత ఎక్కువ వ‌య‌సులో రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారిగా రికార్డుల‌కు ఎక్కారు. బ్రిట‌న్ రాజుగా చార్లెస్‌- 3 ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న వెంట స‌తీమ‌ణి కెమిల్లా, కుమారుడు విలియంలు ఉన్నారు. ఇదిలా ఉంటే... బ్రిట‌న్ రాజుగా చార్లెస్- 3 ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాన్ని టీవీల్లో ప్ర‌సారం చేశారు. ఇలా రాజరిక మార్పు కార్య‌క్ర‌మాన్ని టీవీల్లో ప్ర‌సారం చేయ‌డం ఇదే తొలిసారి.


More Telugu News