ఇక బ్రిటన్ యువరాజు విలియం.. యువరాణి కేట్

  • ప్రకటించిన రాజు చార్లెస్
  • ఇప్పటి వరకు యువరాజు స్థానంలో ఉన్న చార్లెస్
  • ఎలిజబెత్-2 మరణంతో మారిన స్థానాలు
బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 మరణంతో అక్కడి రాచరిక సింహాసనాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ రాజుగా బాధ్యతల్లోకి వచ్చిన వెంటనే కింగ్ చార్లెస్ తన పెద్ద కుమారుడు విలియమ్ ను యువరాజుగా, కోడలు కేట్ ను యువరాణిగా ప్రకటించారు. రాణి ఎలిజబెత్ ఉన్నంత వరకు చార్లెస్ యువరాజుగా ఉన్నారు. రాణి అస్తమయంతో చార్లెస్ రాజు అయ్యారు. ఆయన కుమారుడు యువరాజుగా మారారు. అంటే భవిష్యత్తులో కింగ్ చార్లెస్ అనంతరం.. బ్రిటన్ రాజ సింహాసనాన్ని వారసత్వంగా యువరాజు విలియం అధిష్టించనున్నారు. 

బ్రిటన్ రాజు చార్లెస్ భార్య డయానా 36 ఏళ్ల వయసులో 1997లో కారు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. యువరాణిగా డయానాకు ఎంతో క్రేజీ ఫాలోయింగ్ అప్పట్లో ఉండేది. ఆ తర్వాత యువరాణి స్థానంలోకి వస్తున్నది కేట్ కావడం గమనించాలి. కొత్త యువరాణి అయిన కేట్ మిడిల్ టన్ తన స్థానానికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నారని.. తనదైన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. విలియం, కేట్ ఇద్దరూ 40 ఏళ్ల వయసులోనే ఉన్నారు. 



More Telugu News