ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నేటి నుంచి మూడు రోజులపాటు 15 రైళ్ల రద్దు

  • సికింద్రాబాద్, విజయవాడ, విశాఖ, కాకినాడ మధ్య నడిచే పలు రైళ్ల రద్దు
  • నిర్వహణ పరమైన కారణాలే కారణం
  • ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచన
నేటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహణ పరమైన కారణాలతో 15 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, రేపల్లె, మధిర, కాకినాడ, విశాఖపట్టణం మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. నేడు, రేపు మొత్తంగా 13 రైళ్లు రద్దయ్యాయి.

11న సికింద్రాబాద్-మధిర మధ్య నడిచే రైలు, 12న మధిర-సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇక, రద్దయిన రైళ్లలో కాకినాడ-విశాఖపట్టణం, కాకినాడ-విజయవాడ, విజయవాడ-గూడూరు, గుంటూరు-రేపల్లె, గుంటూరు-విజయవాడ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరింది. 


More Telugu News