మూడో రోజు ముగిసేసరికి 38 కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ
- కన్యాకుమారి నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర
- శుక్రవారం రాత్రి మూడో రోజు యాత్రను ముగించిన రాహుల్ గాంధీ
- 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్న కాంగ్రెస్ నేత
2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట చేపట్టిన యాత్ర శుక్రవారం మూడో రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా యాత్ర చేస్తున్నారు.
శుక్రవారం రాత్రి మూడో రోజు యాత్ర ముగిసినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం మూడో రోజు పాదయాత్ర ముగిసే సరికి రాహుల్ గాంధీ 38 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్ర ఇంకా కన్యాకుమారి పరిసరాల్లోనే కొనసాగుతోంది. మొత్తం 152 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో రాహుల్ గాంధీ మొత్తంగా 3,570 కిలోమీటర్లు నడవనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.