తెలంగాణ మంత్రి నిరంజ‌న్ రెడ్డిపై వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ మంత్రి నిరంజ‌న్ రెడ్డిపై వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • గ‌తంలో ష‌ర్మిల‌ను 'మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు' అన్న నిరంజ‌న్ రెడ్డి
  • పాద‌యాత్ర‌లో నిరంజ‌న్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టిన ష‌ర్మిల‌
  • ప‌రాయి స్త్రీలో త‌ల్లి, చెల్లిని చూడ‌లేని సంస్కారహీనుడ‌ని మంత్రిపై వ్యాఖ్య‌
  • త‌న పోరాటంలో నీకు మ‌ర‌ద‌లు క‌నిపించిందా? అని నిల‌దీత‌
తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల శుక్ర‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌స్థానం పేరిట పాద‌యాత్ర చేస్తున్న ష‌ర్మిల‌... శుక్ర‌వారం నిరంజ‌న్ రెడ్డి సొంత నియోజ‌కవ‌ర్గం వ‌న‌ప‌ర్తిలో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో త‌న‌పై నిరంజ‌న్ రెడ్డి చేసిన వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసుకున్న ష‌ర్మిల‌... ఆయ‌న‌పై ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. 

త‌న‌ను మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు అన్న వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన ష‌ర్మిల‌... ప‌రాయి స్త్రీలో త‌ల్లిని, చెల్లిని చూడ‌లేని సంస్కార హీనుడు నిరంజ‌న్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. నిరంజ‌న్ రెడ్డికి, కుక్క‌కు తేడా ఏమైనా ఉందా? అని కూడా ఆమె మరింత ఘాటు వ్యాఖ్య చేశారు. త‌మ పోరాటంలో నీకు మ‌ర‌ద‌లు క‌నిపించిందా? అని కూడా ఆమె మంత్రిని నిల‌దీశారు. అస‌లు ఎవ‌డ్రా నువ్వు? అంటూ మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య చేసిన ష‌ర్మిల‌... నీకు సిగ్గు ఉండాలి అంటూ ధ్వ‌జ‌మెత్తారు. అధికార మ‌దం త‌లకెక్కి ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నారా? అని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


More Telugu News