గిన్నిస్ రికార్డు స్థాపించిన యంగ్ డైరెక్టర్ కు సీఎం జగన్ అభినందనలు
- 'మనసా నమహః' షార్ట్ ఫిలిం రూపొందించిన దీపక్ రెడ్డి
- షార్ట్ ఫిలింకు 513 అవార్డులు
- గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన లఘుచిత్రం
- సీఎం జగన్ ను కలిసిన దీపక్ రెడ్డి
దీపక్ రెడ్డి అనే యువకుడు రూపొందించిన 'మనసా నమహః' అనే షార్ట్ ఫిలిం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు అందుకుని గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఈ లఘుచిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో 513 అవార్డులు దక్కడం నిజంగా విశేషం. ప్రపంచంలో మరే ఫిలింకు ఇన్ని అవార్డులు రాలేదు. దాంతో, యువ దర్శకుడు దీపక్ రెడ్డి పేరు మార్మోగింది.
ఈ నేపథ్యంలో, దీపక్ రెడ్డి నేడు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. మనసా నమహః షార్ట్ ఫిలిం గురించి, అవార్డులు, గిన్నిస్ బుక్ రికార్డు గురించి దీపక్ రెడ్డి సీఎంకు వివరించారు. ఒక షార్ట్ ఫిలిం అన్ని అవార్డులు అందుకోవడం పట్ల సీఎం జగన్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘనతకు కారకుడైన దీపక్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందించారు.