గంగమ్మ ఒడి చేరిన పంచముఖ వినాయకుడు... ఫొటోలు ఇవిగో
- 50 అడుగుల ఎత్తుతో ఏర్పాటైన ఖైరతాబాద్ వినాయకుడు
- పంచముఖాలతో దర్శనమిచ్చిన గణనాథుడు
- ఉదయం నుంచి రాత్రి దాకా కొనసాగిన శోభా యాత్ర
హైదరాబాద్‌లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక శోభా యాత్రలో శుక్రవారం రాత్రి ఓ కీలక ఘట్టం ముగిసింది. నగరంలోని ఖైరతాబాద్‌లో వెలసిన పంచముఖ వినాయకుడి భారీ విగ్రహం నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో పూర్తయింది. శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ నుంచి మొదలైన పంచముఖ వినాయకుడి యాత్ర... లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరింది. నెక్లెస్ రోడ్ మీద ఏర్పాటు చేసిన నాలుగో నెంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడి చేరాడు.
ఈ ఏడాది పంచముఖ వినాయకుడిగా దాదాపుగా 50 అడుగుల ఎత్తుతో పూర్తిగా మట్టితోనే ఖైరతాబాద్ వినాయకుడు ఏర్పాటైన సంగతి తెలిసిందే. వినాయక చవితి నుంచి శుక్రవారం దాకా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. చివరి రోజైన శుక్రవారం వినాయకుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వీరిలో చాలా మంది పంచముఖ వినాయకుడి శోభాయాత్రలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.