వైన్ షాపులు ఇవ్వండని అడుక్కునే ఖర్మ చంద్రబాబుది: కొడాలి నాని
- ఓ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఢిల్లీకి వెళ్లి స్కాంలో వాటా అడుక్కుంటారా? అన్న నాని
- వైఎస్ భారతికి వైన్ షాపులు అడుక్కునే ఖర్మ లేదని వెల్లడి
- అయినా ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత? అని వ్యాఖ్య
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి, ప్రత్యేకించి ఆయన భార్య వైఎస్ భారతికి సంబంధం ఉందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని శుక్రవారం స్పందించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూనే... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లపైనా నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి ఢిల్లీకి వెళ్లి స్కాంలో వాటా అడుక్కుంటారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. అయినా ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత? అని కూడా నాని వ్యాఖ్యానించారు. వైఎస్ భారతి ఢిల్లీ వెళ్లి వైన్ షాపులకు లైసెన్స్‌లు అడుక్కునే ఖర్మ ఉందా? అని ప్రశ్నించిన నాని... వైన్ షాపులు ఇవ్వండని అడుక్కునే ఖర్మ చంద్రబాబుది అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలవరన్న నాని.. మంగళగిరిలో లోకేశ్ గెలవరని జోస్యం చెప్పారు.