ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ మొదలు
- మధ్యాహ్నం తర్వాత స్వల్పకాలం పాటు నష్టాల్లోకి..
- కనిష్ఠాల వద్ద కొనుగోళ్లతో తిరిగి లాభాల బాట
- కలిసి వచ్చిన అంతర్జాతీయ సానుకూల సంకేతాలు
వారాంతమైన శుక్రవారం స్వల్పంగా ఒడిదుడుకులకు లోనైన స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ సానుకూలంగానే ప్రారంభమైంది. కాసేపు మందకొడిగా ట్రేడింగ్ సాగి.. మధ్యాహ్నం సమయానికల్లా సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి.
అయితే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడం, రూపాయి కూడా కోలుకుంటుండటంతో.. కనిష్ఠాల వద్ద స్టాక్స్ కొనుగోళ్లకు మదుపరులు మొగ్గుచూపారు. దీనితో సూచీలు తిరిగి కోలుకున్నాయి. చమురు ధరలు స్వల్పంగా దిగిరావడం కూడా మార్కెట్లకు కలిసివచ్చింది.
అయితే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడం, రూపాయి కూడా కోలుకుంటుండటంతో.. కనిష్ఠాల వద్ద స్టాక్స్ కొనుగోళ్లకు మదుపరులు మొగ్గుచూపారు. దీనితో సూచీలు తిరిగి కోలుకున్నాయి. చమురు ధరలు స్వల్పంగా దిగిరావడం కూడా మార్కెట్లకు కలిసివచ్చింది.
- ఉదయం 17,923 పాయింట్ల వద్ద నిఫ్టీలో ట్రేడింగ్ ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 17,925 నుంచి 17,786 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 34.60 పాయింట్ల స్వల్ప లాభంతో 17,833 పాయింట్ల వద్ద ముగిసింది.
- ఇక సెన్సెక్స్ 60,045 పాయింట్లతో సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,119 పాయింట్ల నుంచి 59,634 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 104.92 పాయింట్ల లాభంతో 59,793.14 వద్ద ముగిసింది.
- మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.54 వద్ద కొనసాగుతోంది.
- సెన్సెక్స్ 30లో టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి, టీసీఎస్, ఎస్ బీఐ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, హెచ్ యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, టైటన్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్ డీఎఫ్ సీ, భారతి ఎయిర్ టెల్ తదితర షేర్లు నష్టాల్లో ముగిశాయి.