2024లో బీజేపీ ఓడిపోతుంది: సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి

  • ఢిల్లీలో ఏచూరితో చౌతాలా భేటీ
  • జాతీయ రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌
  • విప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయ‌న్న ఏచూరి
  • మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని వ్యాఖ్య 
2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌లు, త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మునుగోడు ఉప ఎన్నిక‌ల‌పై సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంద‌ని చెప్పిన ఏచూరి.. మునుగోడు ఎన్నిక‌ల్లోనూ బీజేపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించే పార్టీ టీఆర్ఎస్సేన‌న్న ఏచూరి... ఈ కార‌ణంగానే తాము టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చినట్లు తెలిపారు. 

హ‌ర్యానా మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలా శుక్ర‌వారం ఢిల్లీలో సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. త్వ‌ర‌లో హ‌ర్యానాలో జ‌ర‌గ‌నున్న స‌మ్మాన్ దివాస్‌కు రావాలంటూ ఆయ‌న ఏచూరిని ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రూ జాతీయ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా 2024 ఎన్నిక‌ల‌పై ఏచూరి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి వ్య‌తిరేకంగా విప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయన్న ఏచూరి.. అదో మంచి ప‌రిణామం అని వ్యాఖ్యానించారు.


More Telugu News