బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన ఎమ్మెల్సీ అనంత‌బాబు... విచార‌ణ‌ను వాయిదా వేసిన హైకోర్టు

  • డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో నిందితుడు అనంత‌బాబు
  • త‌ల్లి మ‌ర‌ణంతో మ‌ధ్యంత‌ర బెయిల్‌తో బ‌య‌ట‌కొచ్చిన వైనం
  • రెగ్యుల‌ర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన వైనం
  • విచార‌ణ‌ను వ‌చ్చే బుధ‌వారానికి వాయిదా వేసిన హైకోర్టు
  • రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కేంద్ర కారాగారంలో లొంగిపోయిన ఎమ్మెల్సీ
డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో నేరాన్ని ఒప్పుకుని జైలు జీవితం గ‌డుపుతున్న వైసీపీ బ‌హిష్కృత ఎమ్మెల్సీ అనంత‌బాబు త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. బెయిల్ కోసం అనంత‌బాబు దాఖ‌లు చేసుకున్న పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు... విచార‌ణ‌ను వ‌చ్చే బుధ‌వారానికి వాయిదా వేసింది. త‌న బెయిల్‌పై హైకోర్టు విచార‌ణ వాయిదా వేయ‌డంతో అనంత‌బాబు శుక్ర‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కేంద్ర కారాగారంలో లొంగిపోయారు.

ఇటీవ‌లే త‌న త‌ల్లి మ‌ర‌ణించ‌గా...త‌ల్లి అంత్య‌క్రియ‌ల్లో పాలుపంచుకునే నిమిత్తం అనంత‌బాబుకు మ‌ధ్యంతర బెయిల్ మంజూరైన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం 3 రోజులు మాత్ర‌మే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టు బెయిల్ మంజూరు చేయ‌గా...దానిపై అనంత‌బాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ క్ర‌మంలో అనంత‌బాబు బెయిల్‌ను మ‌రో 11 రోజుల పాటు పొడిగిస్తూ హైకోర్టు గ‌త నెల‌లో ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ బెయిల్ గ‌డువు ముగియ‌డం, రెగ్యుల‌ర్ బెయిల్‌పై హైకోర్టు విచార‌ణ‌ను వాయిదా వేయ‌డంతో శుక్ర‌వారం అనంత‌బాబు జైలులో లొంగిపోయారు.


More Telugu News