‘లూనా’ బండి మళ్లీ వస్తోంది..!

  • ఎలక్ట్రిక్ వాహనంగా తీసుకొస్తున్న కైనెటిక్
  • ఈ ఏడాది నవంబర్ లో విడుదల
  • సంస్థ వ్యవస్థాపకురాలు ఫిరోడియా వెల్లడి
కైనెటిక్ లూనా మోపెడ్ గుర్తిండే ఉంటుంది. చిన్నగా, వినియోగానికి సౌలభ్యంగా ఉండే ఈ మోపెడ్ తయారీ నిలిచిపోయి చాలా సంవత్సరాలే అవుతోంది. ఈ బండి త్వరలోనే మళ్లీ రోడ్డెక్కనుంది. కాకపోతే ఈ సారి ఎలక్ట్రిక్ వాహనంగా లూనా రానుంది. ఈ విషయాన్ని కైనెటిక్ గ్రూపు ఫౌండర్ సులజ్జా ఫిరోడియా మోత్వానీ తెలిపారు. కంపెనీ వ్యాపార ప్రణాళికల గురించి ఆమె మీడియాతో పంచుకున్నారు.

కైనెటిక్ గ్రీన్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23)లో మొత్తం 50 వేల ద్విచక్ర వాహనాలు, 10 వేల త్రిచక్ర వాహనాలను విక్రయించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఫిరోడియా తెలిపారు. చైనాకు చెందిన ఏఐఎంఏ టెక్నాలజీ గ్రూపుతో కలసి ద్విచక్ర వాహన మార్కెట్లోకి బలంగా విస్తరించాలని కైనెటిక్ గ్రీన్ భావిస్తోంది. 2023 ఆరంభంలో ఏటా 3 లక్షల వాహనాలను తయారు చేయగల కొత్త ప్లాంట్ ను సంస్థ ప్రారంభించనుంది. నవంబర్ నెలలో ఎలక్ట్రిక్ లూనాను మార్కెట్లోకి విడుదల చేస్తామని సులజ్జా ఫిరోడియా వెల్లడించారు. ఏఐఎంఏ టెక్నాలజీ సాయంతో ఈ-స్కూటర్లను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.


More Telugu News