హైదరాబాదులో చెన్నుపాటి గాంధీని పరామర్శించిన టీడీపీ నేతలు
- ఇటీవల విజయవాడలో దాడి
- టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ కంటికి తీవ్రగాయం
- ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స
- ఇటీవల డిశ్చార్జి
ఇటీవల విజయవాడలో జరిగిన దాడిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ కంటికి తీవ్రగాయం కావడం తెలిసిందే. ఆయన హైదరాబాదు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో, నేడు హైదరాబాదులో చెన్నుపాటి గాంధీని టీడీపీ నేతలు పరామర్శించారు.
దేవినేని ఉమ, యరపతినేని శ్రీనివాసరావు, రావి వెంకటేశ్వరరావు హైదరాబాదులో చెన్నుపాటి నివాసానికి వెళ్లారు. ఆయనను పలకరించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ, విజయవాడలో జరిగే అరాచకాలకు సీఎం సమాధానం చెప్పాలని అన్నారు. భయపెట్టాలన్న దుర్మార్గపు చర్యల్లో భాగంగానే చెన్నుపాటి గాంధీపై దాడి జరిగిందని తెలిపారు.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా చెన్నుపాటి గాంధీని పరామర్శించడం తెలిసిందే. వారు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.