బాలాపూర్ లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరుల పోటీ!

  • బాలాపూర్ లడ్డూకు ఎంతో విశిష్టత
  • కాసేపట్లో వేలం ప్రారంభం 
  • గతేడాది బాలాపూర్ లడ్డూకు రూ.18.90 లక్షల ధర
  • ఈసారి రూ.20 లక్షలు దాటే అవకాశం
హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల చరిత్రలో బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. పరిమాణంలో ఖైరతాబాద్ గణపతి అందరికంటే మిన్న అనిపించుకుంటే, బాలాపూర్ లో గణేశుడి లడ్డూ వేలం పాటకు అదేస్థాయి విశిష్టత ఉంది. బాలాపూర్ లడ్డూకు రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. 

1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం కొనసాగుతోంది. మొదట్లో ఇక్కడి లడ్డూ కేవలం రూ.450 ధర పలికింది. ఆ తర్వాత లక్షలకు చేరింది. గత 28 ఏళ్లలో 2021లో రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట సాగింది. గతేడాది బాలాపూర్ లడ్డూకు వేలంలో రూ.18.90 లక్షల ధర పలికింది. ఈసారి రూ.20 లక్షలకు పైగా ధర లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

బాలాపూర్ లో మరికాసేపట్లో లడ్డూ వేలం ప్రారంభం కానుండగా, ఈసారి 9 మంది వేలంలో పాల్గొంటున్నారు. వారిలో ఆరుగురు స్థానికులు కాగా, ముగ్గురు స్థానికేతరులు.


More Telugu News